ప్రజలు ఏం కోల్పోయారో అర్థమైంది.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే : కేసీఆర్

చాలారోజులుగా ఫామ్ హౌస్ కే పరిమితమై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో పలువురు పాలకుర్తి నియోజకవర్గ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆద్వర్యంలో శనివారం కేసీఆర్ సమక్షంలో సినిమా ప్రొడ్యూసర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, సినీ ఆర్టిస్ట్ రవితేజ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కొత్త గవర్నమెంట్ వచ్చి 11నెలలు అవుతుంది.. ప్రజలు ఏం కోల్పోయారో ఇప్పుడు వారికి అర్థమౌతుందన్నారు. ప్రభుత్వాన్ని నడిపించే వారు ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని కేసీఆర్ చెప్పారు.

ALSO READ : మూసీ సమస్యలపై పాదయాత్రకు రెడీ : మాజీ మంత్రి హరీశ్ రావు

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే 100శాతం మళ్లీ అధికారంలోకి వస్తోందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే 90 శాతం ఎక్కువ పథకాలు గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని కేసీఆర్ వివరించారు. ప్రభుత్వం అంటే అందర్ని కాపాడాలి.. నిర్మాణము చేయాలి.. పదిమందికి లాభం చేయాలని ఆయన అన్నారు. కానీ.. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారని చెప్పారు. కష్టపడి పార్టీ కోసం పని చేయాలని కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.