పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కేసీఆర్ ఫోకస్..ఎర్రవల్లి ఫామ్హౌస్లో నేతలకు దిశానిర్దేశం

పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై  కేసీఆర్ ఫోకస్..ఎర్రవల్లి ఫామ్హౌస్లో  నేతలకు దిశానిర్దేశం

బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కసరత్తు మొదలు పెట్టింది. ఆ పార్టీ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ కొన్ని రోజుల నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

 ఈ క్రమంలో ఇవాళ  ఏప్రిల్ 2న  సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. ఏప్రిల్ 27న  వరంగల్ లో జరగనున్న బీఆర్‌ఎస్  సిల్వర్ జూబ్లీ వేడుకలు, మహాసభపై సమావేశంలో చర్చించారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరుపుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. నియోజకవర్గానికి లక్ష మందికి తగ్గకుండా సభకు తరలి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని ఆదేశించారు. మహాసభ ప్రజలకు మనోధైర్యం వచ్చేలా ఉండాలన్నారు. మహా సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.

ALSO READ | కంచె గచ్చిబౌలి భూములపై నివేదికివ్వండి..తెలంగాణకు కేంద్రం ఆదేశం

ఈ సమావేశానికి కేసీఆర్ తో పాటు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు , సునీతా లక్ష్మారెడ్డి, పద్మాదేవెందర్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గంపగోవర్ధన్, గణేష్ బిగాల గుప్త, జాజుల సురేందర్ పలువురు మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఏప్రిల్ 1న   ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్‎లో కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేశారు.  బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం తెలంగాణ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తు్న్నారని.. ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ సభకు తరలివస్తారని అన్నారు. సభకు వచ్చే జనానికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని నేతలను ఆదేశించారు.