లోక్ సభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ దిష్టి తీసినట్టయిందన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. జులై 3న ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో మహాబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుంచి వచ్చిన కార్య కార్యకర్తలు నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయ...ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక పలురకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నదని దుయ్యబట్టారు. ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసి పొరపాటు చేశామని నాలిక కరుసుకుంటున్నారని కేసీఆర్ విమర్శించారు. తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగట్టాలని కార్యకర్తలకు సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరుగబడే రోజులు త్వరలోనే రానున్నాయని కేసీఆర్ అన్నారు. మరికొన్ని రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకొని జనం దోలాడుకుంటా బీఆర్ఎస్ కోసం వస్తారని ధీమా వ్యక్తం చేశారు. అప్పడిదాక ఓపికతో ప్రజా సమస్యలపైన పోరాడుతూ వారికి అందుబాటులో వుండాలని కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. అయితే తనను కలిసేందుకు ముందస్తు సమాచారంతో మాత్రమే రావాలని కార్యకర్తలకు అభిమానులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. వారానికి రెండు నియోజకవర్గాల పేర్లు చెబుతాం... చెప్పిన వాళ్లు మాత్రమే వస్తే లొల్లి లేకుంట వాళ్లతో కడుపునిండ మాట్లాడి పంపిస్తానని కేసీఆర్ తెలిపారు.