త్వరలోనే కేసీఆర్ కార్యాచరణ

త్వరలోనే కేసీఆర్ కార్యాచరణ
  • రైతాంగ సమస్యలపై పోరుబాట
  • ఉత్తమ్ నోరు అదుపులో పెట్టుకో
  • రేవంత్ ను అనాల్సిన మాటలు మమ్మల్ని అంటున్నవ్: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

త్వరలోనే రైతాంగ సమస్యలపై కేసీఆర్ కార్యాచరణ తీసుకోబోతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచి రైతులను ఆదుకునేలా చేస్తామని అన్నారు.  ఇందుకు సంబంధించిన కార్యాచరణ త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని కేసీఆర్ ని డెకాయిట్‌లా పోల్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరును మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తప్పుపట్టారు.

‘ఉత్తమ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి.. పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన మీరే డెకాయిట్లు.. రేవంత్ ని అనాల్సిన మాటలు ఉత్తమ్ మాపై వాడుతున్నరు.  రాష్ట్రంలోనే డెకాయిట్ల పరిపాలన సాగితుంది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ నాయకుల కమీషన్లు , దోపిడీపై ప్రజలు చెబుతారు. నీళ్ళ కోసం , విద్యుత్ కోసం ధర్నాలు జరుగుతున్నాయి ముందు వాటిపై మాట్లాడాలి. అడ్డగోలుగా మాట్లాడితే నిన్న రేవంత్ కి పడ్డ చివాట్లు ఉత్తమ్ కి తప్పవు. తిట్ల దండకం మాట్లాడితే చివాట్లు తప్ప ఉత్తమ్ సీఎం కాలేరు. సాగు నీరు అందించలేక ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ విఫలం అయ్యారు.’ అని జగదీశ్ రెడ్డి విమర్శించారు.