బీజేపీ మేనిఫెస్టోతో బీఆర్ఎస్, కాంగ్రెస్​ మైండ్ బ్లాంక్ : వడ్డీ మోహన్ రెడ్డి

నవీపేట్, వెలుగు: బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోతో బీఆర్ఎస్, కాంగ్రెస్ ​పార్టీల మైండ్ బ్లాంక్ అయిందని బోధన్ బీజేపీ  అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మండలంలోని నందిగామ, అల్జాపూర్, యంచ, మిట్టాపూర్, ఎల్ కె ఫారం, ఫతే నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మోహన్​రెడ్డి మాట్లాడుతూ..  వరికి రూ. 3100 మద్దతు ధర, పిక్స్ డ్ డిపాజిట్ లాంటి హామీలు సమాజంలోని అట్టడుగు స్థాయి ప్రజలకు మేలు చేకూరుస్తాయన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమని, రాష్ట్రంలో ఏర్పడేది డబుల్​ఇంజిన్​సర్కారేనన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్​రెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు సరిన్, ప్రధాన కార్యదర్శి ఆనంద్, మల్లెపూల గంగాధర్ పాల్గొన్నారు.