కార్పొరేటర్ల మధ్య విభేదాలు లేవు

గోదావరిఖని, వెలుగు : తామంతా సమైక్యంగా ఉన్నామని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవిశ్వాసం ఆలోచన లేదని రామగుండం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్లు స్పష్టం చేశారు. సోమవారం మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, పాముకుంట్ల భాస్కర్, కల్వచర్ల కృష్ణ వేణి, బాలరాజ్ కుమార్, కవితా సరోజినీ, శంకర్ నాయక్, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, తానిపర్తి గోపాల రావు, కల్వల సంజీవ్, జెవి రాజు, బొడ్డు రవీందర్ మాట్లాడారు. 

ALSOREAD:టీఎస్‌పీఎస్సీ ఎదుట పీఈటీ అభ్యర్థుల ఆందోళన

కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకొని అసెంబ్లీ ఎన్నికల కోడ్ కంటే ముందే కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతిపాదించిన డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో అభివృద్ది పనులు పూర్తి చేయించడంపై కార్పొరేటర్లు ఇటీవల సమావేశమై చర్చించారని, దీనిపై వివిధ రకాల ఊహాగానాలు ప్రచారమయ్యాయని వారన్నారు. తమలో వర్గాలు లేవని, ఏ ఒక్క కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవిశ్వాసం పెట్టాలనే ఆలోచన కూడా లేదన్నారు.