
స్టాండింగ్ కమిటీ ఎన్నిక పోటీ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లు తప్పుకుంటున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలో పోటీ చేసేందుకు ఫిబ్రవరి 11న ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ దాఖలు చేశారు. అయితే సరైన సంఖ్యా బలం లేకపోవడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు విత్ డ్రా చేసుకుంటున్నారు.
ఫిబ్రవరి 20న అడ్డగుట్ట బీర్ఎస్ కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో నామినేషన్ల సంఖ్య 16కు చేరింది. బీఆర్ఎస్ కు చెందిన మరోక్క నామినేషన్ విత్ డ్రా అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఫిబ్రవరి 21 (రేపు) మధ్యాహ్నం వరకు కూకట్ పల్లి బీఆర్ఎస్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ నామినేషన్ ను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఇంకా నామినేషన్ల విత్ డ్రాకు(ఫిబ్రవరి 21 వరకు ) ఇంకా ఒక రోజు అవకాశం ఉంది.
Also Read :- హైడ్రా DRF లోకి 357 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
జూపల్లి సత్యనారాయణ నామినేషన్ ఉపసంహరించుకుంటే.. స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం అయినట్లు ఫిబ్రవరి 21 మధ్యాహ్నం ప్రకటించనున్నారు అధికారులు. ఏకగ్రీవం తరువాత స్టాండింగ్ కమిటీలో ఏడుగురు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఎనిమిది మంది ఎంఐఎం కార్పొరేటర్లు ఉంటారు. నామినేషన్లు 15 కంటే ఎక్కువ ఉంటే ఫిబ్రవరి 25న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితం ప్రకటించనుంది జీహెచ్ఎంసీ.
స్టాండింగ్ కమిటీ ఎన్నికకు మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి ఏడుగురు, ఎనిమిది మంది ఎంఐఎం కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి ఇద్దరు నామినేషన్ వేయగా..బీజేపీ పోటీకి దూరంగా ఉంది.