కోరుట్లలో దారుణం జరిగింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్తపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు హత్యచేశారు. మంగళవారం ఉదయం కార్గిల్ చౌరస్తా దగ్గర కూరగాయల దుకాణంలో కౌన్సిలర్ పొగుల ఉమారాణి భర్త పోగుల లక్ష్మిరాజం ఉన్నాడు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అందరు చూస్తుండగానే కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలైన అతడిని స్థానికులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరిన కాసేపటికే లక్ష్మిరాజం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.
పోగుల లక్ష్మీరాజ్యం మామిడి తోటల కాంట్రాక్టర్. ఓ భూవివాదంలో ఉన్న పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. కత్తిపోట్లు జరిగిన తర్వాత బాధితుడు నాగరాజు అనే వ్యక్తి పేరు పలికినట్లు స్థానికులు చెబుతున్నారు.