నల్లగొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు షాక్

నల్లగొండ జిల్లా  మున్సిపాలిటీలో అధికార పార్టీ బీఆర్ఎస్ కు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. పలవురు బిఆర్ఎస్  కౌన్సిలర్లు, మరి కొంతమంది సర్పంచ్ లు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అసంతృప్తి నేతలను ఇప్పటికే మండలి ఛైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో సమావేశమై బుజ్జగించిన లాభం లేనట్లు సమాచారం. 

నిన్న(2023 అక్టోబర్ 16)  ప్రచారంలో పాల్గొనాలని వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కలిశారు. దీంతో నిన్న  పానగల్ లో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో  నేతలు పాల్గొన్నారు. అయితే, సాయంకాలం వరకే  నల్లగొండ  మున్సిపాలిటీలో రాజకీయాలు మారిపోయాయి. అసంతృప్తి నేతలందరూ ఎంపీ కోమటిరెడ్డికి టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం మున్సిపల్ వైస్ చైర్మన్ సహా  ఐదుగురు కౌన్సిలర్స్, పలువురు సర్పంచ్ లు తమ ఫోన్లు స్విచ్చాఫ్ చేసకున్నారు. దీంతో  వారు బిఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.