
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలోని 3వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ సాయి ప్రణయ్ గురువారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ప్రజా సేవా భవన్లో ఆయనతో పాటు పార్టీలో చేరిన తిలక్నగర్, ఖానాపూర్ కాలనీ వాసులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి - వెంకట్ రెడ్డి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ పాల్గొన్నారు.