
హుజూర్ నగర్, వెలుగు: హుజూర్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. మున్సిపల్ పరిధిలోని28 వ వార్డు కౌన్సిలర్ అమరబోయిన గంగరాజు మంగళవారం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాశాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కౌన్సిలర్కు మంత్రి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.