హుజూర్ నగర్ , వెలుగు: హుజూర్ నగర్ మున్సిపల్ రెండో వార్డు కౌన్సిలర్ జక్కుల శంబయ్య , నాలుగో వార్డు కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరారు. శనివారం హైదరాబాద్‌లో ఇరిగేషన్, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం హౌసింగ్ బోర్డ్ ఔట్ సోర్పింగ్ ఉద్యోగులు తమను కొనసాగించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్ గెల్లి రవి , కౌన్సిలర్ అమరపోయిన సతీశ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ పిన్నాని దళపతి పాల్గొన్నారు.