- ఏడాదిన్నరలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం
నల్గొండ/మునుగోడు వెలుగు : ఉప ఎన్నికల్లో మునుగోడుకు ఇచ్చిన హామీలన్నీ దాదాపు నెరవేర్చామని, ఇంకొన్ని పనులు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. గురువారం మునుగోడులో జరిగిన ప్రజా ఆశ్వీరాద సభలో ఆయన మాట్లాడుతూ.. చండూరు డివిజన్, వంద పడకల ఆస్పత్రి లాంటి పనులు ఇప్పటికే కంప్లీట్ చేశామని చెప్పారు. పాలమూరు-–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు చివరి దశలో ఉన్నాయని, ఇటీవలే ఒక మోటారు ఓపెన్ చేశామని చెప్పారు. ఏడాదిన్నర లోగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కంప్లీట్ చేసి నియోజకవ ర్గంలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మునుగోడు కమ్యూనిస్టుల చైతన్యం కలిగిన గడ్డ అని.. ఉప ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
మునుగోడు గోస తీర్చిన కేసీఆర్: మంత్రి జగదీశ్ రెడ్డి
మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ మహమ్మారిని తరమికొట్టి ఇక్కడి ప్రజల గోస తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. తాము పెద్ద నాయకులమని చెప్పుకోనే వాళ్లు ఏళ్లుగా అధికారంలో ఉన్నా ప్రజల బాధలు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఉద్యమకారుడుగా ఊరురా తిరిగిన కేసీఆర్‌కు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నయో తెలుసన్నారు. సమస్యలను పరిష్కారం చేయడంతో పాటు రాష్ట్రాన్ని దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్దారని కొనియాడారు.
కాంట్రాక్టుల కోసమే పార్టీ మారుతున్న రాజగోపాల్
ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కర్నాటకలో కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నాడని, పూటకో మాట రోజుకో జెండా మార్చే మోసగాడిని నమ్మొద్దని సూచించారు. ఒకసారి గెలిపిస్తే నాలుగేళ్లు కనబడకుండా కాంట్రాక్టుల కోసమే రాష్ట్రాలు పట్టుకుని తిరిగాడని, తాను పక్కా లోకల్ అని మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.570 కోట్లతో పనులు చేపట్టామని, ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఈ సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జెల్లా మార్కండేయ, మునగాల నారాయణరావు తదితరులు పా ల్గొన్నారు.
9 నిమిషాల్లోనే సభ ముగింపు..
షెడ్యూల్ ప్రకారం 3గంటలకు రావాల్సిన సీఎం సాయంత్రం 6 గంటలకు మునుగోడుకు చేరుకున్నారు. మధ్యాహ్నాం 2 గంటలకే మునుగోడు చే రుకున్న జనం సీఎం రాకకోసం ఎదురుచూశారు. సీఎం రాక ఆలస్యం కా వడంతో ఆయన సభ ప్రాంగాణానికి చేరుకోగానే జనం సభ నుంచి వెళ్లిపో యేందుకు సిద్ధమయ్యారు. దీంతో సీఎం సైతం తన స్పీచ్‌ను కేవలం 9 ని మిషాల్లోనే ముగించాల్సి వచ్చింది. సీఎం రావడం ఆలస్యమవడంతో అప్ప టికి చీకటిపడటంతో తిరుగప్రయాణం రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళ్లారు. సభకు వచ్చిన జనం నిరుత్సాహ పడొద్దన్న ఉద్దేశంతో మళ్లీ ప్రత్యేకం గా మునుగోడుకు వస్తానని, ఎన్నికల చివరి దశలో మరొక సభ పెట్టుకుం దామని సీఎం చెప్పారు.
ALSO READ : సోషల్ మీడియాపై పోలీసుల అత్యుత్సాహం
ఎమ్మెల్యే పిలవలే...అసమ్మతి నేతలు రాలే
సీఎం సభకు మునుగోడు బీఆర్ఎస్ అసమ్మతి నేతలు గైర్హాజరయ్యారు. 40 మంది సర్పంచ్‌లు, 27 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నారబోయిన స్వరూప రాణి, గుత్తా ఉమ, ఏలుగోటి వెంకటేశ్వర రెడ్డి, చౌటుప్పుల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, సీనియర్లు కర్నాటి విద్యాసాగర్, వేనేపల్లి వెంకటేశ్వరరావు తదితరులు సభకు రాలేదు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పిలువకపోవడంతోనే సభకు దూరంగా ఉండాల్సి వచ్చిందని వాళ్లు చెబుతున్నారు. వారంతా ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని మార్చాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. హైకమాండ్ బుజ్జగింపులతో ఉప ఎన్నికల్లో దారికొచ్చినా.. మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది.