ఎమ్మెల్యే రోహిత్​పై కేసు నమోదు చేయాలి : పద్మా దేవేందర్ రెడ్డి

ఎమ్మెల్యే రోహిత్​పై కేసు నమోదు చేయాలి : పద్మా దేవేందర్ రెడ్డి
  • బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్ టౌన్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రోహిత్​రావుపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతీసే విధంగా రోహిత్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా మాట్లాడాలి కానీ అతని మాటలు దిగజార్చే విధంగా ఉన్నాయన్నారు.

నియోజకవర్గాన్ని  అభివృద్ధి చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని నెరవేర్చి మెదక్​ను అభివృద్ధి పథంలో నడిపించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో కలిసి ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్​చార్జి తిరుపతి రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ పాల్గొన్నారు.