ఆదానీకి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకే ధరల పెంపు: మంత్రి గంగుల

భారతదేశానికి మోడీ  ప్రధాని కావడం ప్రజల దురదృష్టమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదానీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే గ్యాస్ ధరలను పెంచారని మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలపై ఆడబిడ్డలు ఆలోచించాలన్నారు. కరీంనగర్‭లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. రోడ్డు ప్రక్కన కట్టెల పొయ్యి పై వంట చేస్తూ నిరసన తెలిపారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి.. ప్రధాని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీని బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని గంగుల కమలాకర్ అన్నారు. నరేంద్ర మోడీ నిరంకశ పాలన నసించాలని ఆరోపించారు.  

పెరిగిన ధరలు తగ్గించే వరకు ఆడబిడ్డలు చేపట్టే ఉద్యమానికి బిఆర్ఎస్ అండగా ఉంటుందని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. పెంచిన గ్యాస్  ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి కావడంతో.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి పేద, మధ్య తరగతి ప్రజలపై ఊహించని భారాన్ని మోపిందని మంత్రి గంగుల ఆరోపించారు.