ఫార్ములా ఈ రేసు కేసులో సంచలన కోణాన్ని బయటపెట్టిన ప్రభుత్వం

ఫార్ములా ఈ రేసు కేసులో సంచలన కోణాన్ని బయటపెట్టిన ప్రభుత్వం

హైదరాబాద్: ఫార్ములా ఈ రేసు కేసులో సంచలన కోణాన్ని ప్రభుత్వం బయటపెట్టింది. ఫార్ములా ఈ రేసు నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ నుంచి బీఆర్ఎస్కు భారీగా లబ్ది చేకూరినట్టు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి గ్రీన్ కో బాండ్లు కొన్నట్లు సమాచారం. ఈ డేటాను ప్రభుత్వం తాజాగా బయటపెట్టింది. బీఆర్ఎస్ నుంచి రూ.49 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను గ్రీన్ కో కంపెనీ, అనుబంధ సంస్థలు కొన్నట్లు తెలిసింది. 2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 మధ్య లావాదేవీలు జరిగాయి. ఈ కేసుకు సంబంధించిన చర్చలు మొదలైనప్పటి నుంచి లావాదేవీలు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వనుందా..? 

ప్రతీసారి రూ.కోటి విలువ చేసే బాండ్లను గ్రీన్ కో కంపెనీ కొనడం గమనార్హం. మోసాలు, దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుందని, గ్రీన్ కో కంపెనీ నుంచి బీఆర్ఎస్ కు రూ.49 కోట్లు వచ్చాయని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ ఆరోపించారు. బీఆర్ఎస్, గ్రీన్ కో కంపెనీ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ గ్రీన్ కో బాండ్ల గురించి కూడా కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ జనవరి 7న ఈడీ విచారణను ఎదుర్కోవాల్సి ఉంది.