కాంగ్రెస్ లో  చేరిన బీఆర్​ఎస్​ కుటుంబాలు

ఖమ్మం రూరల్, వెలుగు: బీఆర్ఎస్​, సీపీఎం నుంచి పలు కుటుంబాలు కాంగ్రెస్​ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాదరెడ్డి సమక్షంలో సోమవారం కాంగ్రెస్​లో చేరాయి. ఖమ్మం రూరల్​ మండలం వెంకటగిరి ఇందిరమ్మ కాలనీ ఫేజ్​-1, ఎం. వెంకటాయపాలెం, పల్లెగూడెం, గొల్లగూడెం గ్రామాలకు చెందిన పలువురు బీఆర్​ఎస్​న వీడారు.  సాయి గణేష్ నగర్ లోని కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్లో  పొంగులేటి ప్రసాద్ రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ లో చేరిన వారిలో బీఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి ఎస్ కే. బాబు సాహెబ్, వత్తిని సాయి కుమార్, వడిగే రవీందర్ బాబు తదితరులు ఉన్నారు. మెండెం వెంకటేష్ యాదవ్ ఉన్నారు. 

దమ్మాయిగూడెంలో 30 కుటుంబాలు చేరిక... 

తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెంలో బీఆర్ ఎస్ కు చెందిన 30 కుటుంబాలు ఉన్నం రాజశేఖర్, వేముల ఉపేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. వీరికి కాంగ్రెస్ నేత రాయల నాగేశ్వరరావు తో కలిసి   పొంగులేటి ప్రసాద్ రెడ్డి   కండువాలు కప్పి ఆహ్వానించారు.  పార్టీలో చేరిన వారిలో హస్తం   వార్డు మెంబర్​ రమిజానీ, కేసీఆర్ సేవాదళ్ మైనారిటీ సంఘం జిల్లా అధ్యక్షుడు షకీల్ పాషా, వీరెల్లి ఉపేందర్, లాల్ బీ, శాబీరాతదితరులు ఉన్నారు.