
నిజామాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ను అరెస్ట్ చేశారు. షకీల్ను అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. అనారోగ్య కారణాలు చూపెట్టడంతో షకీల్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రగతి భవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడికి బదులు మరొకరిని పోలీస్ ఎదుట షకీల్ లొంగుబాటు చేయించారు. సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై షకీల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై ఇప్పటికే ఆయనపై అనేక కేసులున్నాయి.
రోడ్డు ప్రమాదాల్లో కొడుకు రాహిల్‌పై కేసులు నమోదు కాగా, అతడిని తప్పించేందుకు ప్రయత్నించాడని, కొడుకును దుబాయ్పంపించాడన్న ఆరోపణలు ఉన్నాయి. 2023 డిసెంబర్ 23న ప్రజాభవన్ వద్ద షకీల్ కొడుకు రాహిల్ కారుతో బీభత్సం సృష్టించాడు. తాగిన మైకంలో రాత్రి 2.45 గంటల ప్రాంతంలో ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీ కొట్టాడు. ఆ సమయంలో కారులో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులున్నారు.
పంజాగుట్ట పోలీసులు స్పాట్‌కు వెళ్లి కారు నడుపుతున్న రాహిల్‌ను పీఎస్‌కు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న షకీల్ ఆ రోజు రాత్రే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి కొడుకుకు బదులు ఇంట్లో పనిచేస్తున్న అబ్దుల్‌ఆసిఫ్‌ను నిందితుడిగా చేర్చారు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు షకీల్‌ను కూడా కేసులో నిందితుడిగా చేర్చారు. తర్వాత పోలీసులకు మస్కా కొట్టి కొడుకుతో సహా దుబాయ్ పారిపోయాడు. కొంతకాలంగా దుబాయ్‌లో తలదాచుకుంటున్న షకీల్.. తల్లి మరణంతో గురువారం(ఏప్రిల్ 10న) హైదరాబాద్ వచ్చారు.