
బీఆర్ఎస్ సీనియర్ నేత, సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కొనేరు కోనప్ప సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్, బీఎస్పీ పోత్తుపై కోనప్ప అసంతృప్తిగా ఉన్నారు. సిర్పూర్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయడంతోనే తాను ఓడిపోయినట్టు చెప్తున్నారు.
ఇప్పుడు ఆర్ఎస్పీ ప్రవీణ కుమార్ తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచే ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ ను కోనప్ప కలవడం చర్చనీయాంశంగా మారింది.
కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన అనంతరం కోనేరు కోనప్ప కాంగ్రెస్‌లో చేరనున్నున్నారని సమాచారం. గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి కోనప్ప పై ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. అయితే ఇక్కడి నుంచి బీజేపీ తరుపున పోటీ చేసిన పాల్వాయి హరీష్ బాబు 3 వేల ఓట్ల తేడాతో కోనప్పపై విజయం సాధించారు.