మానుకోట బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు

మానుకోట బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు
  • మాజీ మంత్రి సత్యవతి రాథోడ్​ తీరుపై ఎమ్మెల్సీ రవీందర్​రావు ఫైర్
  • హైకమాండ్​కు ఫిర్యాదు చేస్తానని వెల్లడి

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్​ బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఆదివారం పట్టణంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్​ రావు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్​ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మానుకోటలో ఇప్పటికే బీఆర్ఎస్ లో ఐక్యత లేక, వర్గ విభేదాల మూలంగా పార్టీ భ్రష్టు పట్టిపోయిందని ఫైర్  అయ్యారు. రజతోత్సవసభ సమన్వయ బాధ్యతలను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్​కు అప్పగించారని చెప్పారు.

సన్నాహక సమావేశాలు సక్రమంగా నిర్వహించడం లేదని, సమావేశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో వర్గ విభేదాల కారణంగా గత అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికల్లో అభ్యర్థులు ఓడిపోయారని పేర్కొన్నారు. పార్టీ రజతోత్సవ సమావేశాల్లోనూ ఐక్యత చాటకుండా, ఎవరికి వారుగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. మాజీ మంత్రి సత్యవతి తీరుపై పార్టీ హైకమాండ్​కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఇప్పటికైనా అందరినీ కలుపుకొని పోతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. మాజీ మున్సిపల్  వైస్  చైర్మన్  మార్నేని వెంకన్న, రవి, ఎడ్ల వేణు, తేళ్ల శ్రీనివాస్, మడత వెంకన్న, రఘు పాల్గొన్నారు.