- మధిర బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజు
మధిర, వెలుగు : ముచ్చటగా మూడోసారి ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని ఎంపీ నామా నాగేశ్వరరావు , జడ్పీ చైర్మన్, మధిర బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజు అన్నారు. సోమవారం సీఎం సభా స్థలం వద్ద మీడియా సమావేశంలో లింగాల కమల్ రాజు మాట్లాడుతూ బీఆర్ఎస్ విజయం కోసం 21న మధిర పట్టణంలో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు. తనను కేసీఆర్ ఆశీర్వదించి ప్రజల్లోకి పంపారని కమల్ రాజు తెలిపారు. రాష్ర్ట అభివృద్ధికి కృషిచేసిన బీఆర్ఎస్కు మాత్రమే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందన్నారు.
జిల్లాలో పదికి పది సీట్లు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారని దీమా వ్యక్తం చేశారు. 30న జరిగే ఎన్నికల్లో మధిరతో పాటు 100 స్థానాల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలోనే అగ్రగామిగా నిలిచాయన్నారు. అనంతరం సీఎం సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు.
కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ జిల్లా ఉపాధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య, చిత్తారి నాగేశ్వరావు, రంగి శెట్టి కోటేశ్వరరావు, మొండితోక జయకర్ , రావూరి శ్రీనివాసరావు కనుమూరి , వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.