గత సర్కార్ మా కడుపులు కొట్టింది : మన్నె శ్రీధర్​రావు

ఖైరతాబాద్​, వెలుగు :  గత బీఆర్ఎస్‌‌ ప్రభుత్వం శ్మశానాల అభివృద్ధి పేరుతో వాటిని  ప్రైవేటు వ్యక్తులకు వాటిని అప్పగించి తమ కడుపులు కొట్టిందని గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాల బేగరి వృత్తి దారుల సంఘం అధ్యక్షుడు మన్నె శ్రీధర్​రావు ఆరోపించారు.  శనివారం సోమాజిగూడ ప్రెస్‌‌క్లబ్‌‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  అభివృద్ధి పేరుతో ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించిన వాటిని వెంటనే రద్దు చేయాలన్నారు.

మాల బేగరుల కులవృత్తి (కాటికాపరులకు) కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన జీవో  జారీ చేయాలన్నారు.  ప్రభుత్వం ద్వారా కాటి కాపరులకు గుర్తింపు కార్డులు, హెల్త్​కార్డులు మంజూరు చేయాలని సీఎంను కోరారు.  పంజాగుట్ట శ్మశాన వాటిక ప్రహరీని తొలగించి ఓ వ్యక్తి మాల్​ నిర్మిస్తున్నా..  

సంబంధిత  అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. శ్మశాన వాటిక భూమిని రక్షించాలని డిమాండ్ చేశారు.  సమావేశంలో సంఘం జనరల్​ సెక్రటరీ తునికి పద్మాకర్  పాల్గొన్నారు.