కుభీరు, వెలుగు: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల తెలంగాణగా మార్చిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు. ప్రస్తుతం ఉన్నవారిపైనే కాకుండా రాబోయే తరాలపై కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసిందని మండిపడ్డారు. పల్లె పల్లెకు బీజేపీ–గడప గడపకు మోహన్రావు పటేల్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కుభీరు మండలంలోని సిర్పల్లి, ఫకీర్ నాయక్ తండాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, క్యాలెండర్ అందజేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ప్రతి గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యోగిత, పండిత్ జాదవ్, అజయ్ జాదవ్, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
ALSO READ :స్పీకర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదు : డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో బీజేపీని అశీర్వదించండి
జన్నారం: నిరంకుశ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పి బీజేపీని ఆశీర్వదించాలని మాజీ ఎంపీ, బీజేపీ లీడర్ రాథోడ్ రమేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని కవ్వాల్, సింగరాయిపేట గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేతిరేక విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా సింగరాయిపేట గ్రామంలోని యువకులు బీజేపీ చేరగా, వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి
ఆహ్వనించారు.