గత పాలకులు అమరులను పట్టించుకోలేదు

గత పాలకులు అమరులను పట్టించుకోలేదు
  • ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ కోదండరాం

సూర్యాపేట, వెలుగు : ఎంతో మంది త్యాగాలు, ప్రజాపోరాటాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ కోదండరాం చెప్పారు. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం పదేండ్లలో అమరులను పట్టించుకోలేదని, వారికి కనీస గుర్తింపు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు కొండేటి వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి వర్ధంతిని తెలంగాణ విద్యార్థి యువజన సమితి ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేటలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదండరాం హాజరై వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ అమరుల ఆశయ సాధనకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్, బైరి రమేశ్‌‌‌‌‌‌‌‌, నాయకులు బొడ్డు శంకర్‌‌‌‌‌‌‌‌, జాటోత్‌‌‌‌‌‌‌‌ శ్రీను, కొల్లు కృష్ణారెడ్డి, వినయ్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, సూర్యనారాయణ, ఏనుగు మధుసూదన్‌‌‌‌‌‌‌‌, యాకోబురెడ్డి, సతీశ్‌‌‌‌‌‌‌‌, ఫరీదుద్దీన్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. అంతకుముందు సూర్యాపేటలో జరిగిన ‘75 ఏండ్ల భారత రాజ్యాంగం – గమ్యం, గమనం’ సెమినార్‌‌‌‌‌‌‌‌కు కోదండరాం హాజరయ్యారు. 

రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కొందరు అవినీతి పాలకులు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో సెంటర్‌‌‌‌‌‌‌‌ ఫల్‌‌‌‌‌‌‌‌ దళిత్‌‌‌‌‌‌‌‌ స్టడీస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ మల్లేపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు.