ఇవ్వని హామీలను సైతం ప్రభుత్వం​ అందిస్తోంది: ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఎన్నికల సమయంలో ఇవ్వని హామీలను సైతం బీఆర్​ఎస్​ప్రభుత్వం అమలు చేస్తూ ప్రజలకు వాటి ఫలాలను అందిస్తోందని ఎమ్మెల్యే జోగు రామన్న చెప్పారు. ఆదిలాబాద్​గ్రామీణ మండలం చాందా‘టి’ గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జోగు రామన్న మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్​పార్టీలు ధరలు, దగా పార్టీలుగా పేరుకెక్కాయని ఎద్దేవా చేశారు. 

ALSO READ :పొర్లుదండాలతో కార్మికుల నిరసన 

ఈ సందర్భంగా రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన సవారి బంగ్లా షెడ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. పలు పార్టీలకు చెందిన చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయన ఆధ్వర్యంలో బీఆర్​ఎస్​లో చేరగా.. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో డీసీసీబీ, గ్రంథాలయ చైర్మన్లు అడ్డి భోజారెడ్డి, రౌత్ మనోహర్, రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడు రోకండ్ల రమేశ్, ఎంపీపీ గండ్రత్ రమేశ్​తదితరులు పాల్గొన్నారు.