జీవో 118 పేరుతో బీఆర్ఎస్ సర్కార్ మోసం: మధుయాష్కీ గౌడ్

జీవో 118 పేరుతో బీఆర్ఎస్ సర్కార్  మోసం: మధుయాష్కీ గౌడ్

ఎల్బీనగర్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో118 పేరుతో  పేదలను మోసం చేసిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ ఆరోపించారు. వనస్థలిపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని జీవో 118 బాధిత కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు సోమవారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా 118 జీవో ద్వారా తాము ఎలా మోసపోయామనే విషయాన్ని వివవరించారు. అనంతరం మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ.. ఓట్ల కోసం అప్పటి బీఆర్ఎస్  ప్రభుత్వం హడావిడిగా జీవో 118 తెచ్చిందన్నారు. పేద ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపకుండా ఓట్లు వేయించుకున్నట్లు విమర్శించారు.