గౌరవెళ్లి నీళ్లు తీసుకురాకుంటే మళ్లీ ఓటు అడగను: పొన్నం ప్రభాకర్‌‌

భీమదేవరపల్లి, వెలుగు : గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్ట్‌‌లను పూర్తి చేసి హుస్నాబాద్‌‌ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు ఇస్తానని, లేకుంటే మరోసారి ఓట్లు అడగనని కాంగ్రెస్‌‌ క్యాండిడేట్‌‌ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్‌‌ రెండూ ఒకటేనని, కాంగ్రెస్‌‌కు ఓటేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.

ALSO READ: ఎలక్షన్ ఎఫెక్ట్ : రాత్రులు త్వరగా మూతపడుతున్న రెస్టారెంట్లు, షాపులు

అధికార మార్పును ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బీఆర్‌‌ఎస్‌‌ తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను మోసం చేసిందన్నారు. హుస్నాబాద్‌‌ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పెరుమాండ్ల రామకృష్ణ, మండల అధ్యక్షుడు ఐలయ్య, మహిళా అధ్యక్షురాలు స్వరూప, ప్రకాశ్‌‌, రవీందర్‌‌, రాజు పాల్గొన్నారు.