- దాడులతో హైదరాబాద్ఇమేజ్ను దెబ్బతీసుండ్రు
- పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వలేదా..?
- పోలీసులపైనే దాడులు చేస్తారా..?
- ఐటీ కంపెనీలు రాకుండా కుట్ర చేస్తుండ్రు
హైదరాబాద్: పార్టీ పిరాయింపులపై బీఆర్ఎస్ నాయకులు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు మాట్లాడుతున్నారని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇవ్వలేదా..? అని ఆయన ప్రశ్నించారు.
ALSO READ | నేనేమైనా చేతగాని వాడినా.. కౌశిక్ నోరు అదుపులో పెట్టుకోవాలి : అరికెపూడి వార్నింగ్
ధర్నా చేయడానికి ధర్నా చౌక్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఉంటే ప్రశ్నించండి. ఇలా మీరు మీరే దాడులు చేసుకోవడం కరెక్ట్ కాదు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. బీఆర్ఎస్ నాయకులు పోలీసుల పైనే దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దాడులను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. వ్యవస్థకు వ్యతిరేకంగా పని చేయొద్దు. పదేళ్లు కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ హోదాలో ఎవరిపైనా దాడులు చేయలేదు. ఇలాంటి చర్యలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయాలని బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది. ఐటీ కంపెనీలు హైదరాబాద్కు రాకుండా ప్రయత్నం చేస్తున్నారని మల్లు రవి మండిపడ్డారు.