బీఆర్ఎస్కు తెలంగాణకు సంబంధం లేదు : బండి సంజయ్

గడీల పాలనను బద్దలు కొట్టేందుకే పాదయాత్ర చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గానికి మేలు జరిగిందని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం భూమి, గ్రానైట్, సాండ్ స్కాంలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేసీఆర్ జగన్ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని విమర్శించారు.  బీఆర్ఎస్ పేరుతో తెలంగాణను పక్కనబెట్టారని.. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని అన్నారు. 

కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ లతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. బీజేపీ వచ్చాక ప్రతి పేదోడికి ఇల్లు కట్టిస్తామన్నారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటిన జీతాలు ఇస్తామని తెలిపారు. ధరణి పేరుతో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.

కార్యకర్తల కష్టంతోనే ఈ స్థాయికి ఎదిగా: బండి సంజయ్

కరీంనగర్ గడ్డ తనకెంతో ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. కరీంనగర్ లో జరుగుతున్న ప్రజాసంగ్రామయాత్ర ముగింపుసభలో ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  తాను ఓడిపోతే కార్యకర్తలు ఏడ్చారని..దానిపై దేశం అంతా చర్చ జరిగిందన్నారు.

కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అని..కార్యకర్తల కష్టం వల్లే తాను గెలిచానని చెప్పారు.  అవమానాలకు తాను భయపడనని చెప్పారు.  కరీంనగర్ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. పింక్ జెండాతో అపవిత్రమైన తెలంగాణను కాషాయ జెండాతో పవిత్రం చేయమని జాతీయ నాయకత్వం సూచించిందని తెలిపారు. పింక్ జెండాతో అపవిత్రమైన తెలంగాణను కాషాయ జెండాతో పవిత్రం చేయమని జాతీయ నాయకత్వం సూచించిందని తెలిపారు. అందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టినట్లు తెలిపారు