రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేలు సహయం చేస్తున్నామని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా పరిహారం రూ.10 వేలు ఇస్తున్నారా అని ఆయన ప్రశ్ని్ంచారు. సీఎం కేసీఆర్ ను ఎదురుకునే ధైర్యం లేకే ఎమ్మెల్సీ కవితను బీజేపీ టార్గెట్ చేసిందని ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. విచారణ పేరుతో గంటల కొద్ది కవితను విచారిస్తూ కక్ష్యసాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ మోడల్ అభివృద్ధి- సంక్షేమ పథకాలను దేశమంతా ప్రజలు కోరుకుంటున్నారని ఇంద్రకరణ్ చెప్పారు. నిరంతరం ప్రజల కోసం పని చేసే పార్టీ బీఆర్ఎస్ ఒక్కటేనని అన్నారు. పార్టీ బలోపేతానికి ఆత్మీయ సమ్మేళనాలను వేదికగా మలుచుకోవాలని నేతలకు,కార్యకర్తలకు సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.