సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ ​ముందుంటుంది.. చైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్​​ 

ధర్పల్లి, వెలుగు: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుదని టీఎస్​ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్​ రూరల్​ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ పేర్కొన్నారు. సోమవారం ధర్పల్లి మండలకేంద్రంలోని మున్నూరుకాపు కల్యాణ మండపంలో నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్​బెడ్రూం ఇళ్లు, ఉచిత కరెంట్, రైతుబంధు లాంటి పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఐడీసీ ఎంఎస్​చైర్మన్​ సాంబరీ మోహన్, జడ్పీటీసీ జగన్, ఎంపీపీ సారిక హన్మంత్​రెడ్డి, వైస్​ఎంపీపీ నవీన్​రెడ్డి పాల్గొన్నారు.