- తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం
జూబ్లీహిల్స్, వెలుగు: ఓడిపోతామనే భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయట్లేదని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం విమర్శించారు. బుధవారం ఆయన బంజారాహిల్స్లో మీడియాతో మాట్లాడారు. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్నేతలు రాష్ట్రాన్ని ఎంతగా దోచుకున్నారో ప్రజలకు తెలుసన్నారు.
ఓడిపోతామనే టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేదన్నారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసమే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుందని ఆయన ఆరోపించారు. అవినీతి కేసుల్లో కవిత, హరీశ్, కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమన్నారు.