పార్లమెంట్లో బీఆర్ఎస్ జీరో.. పార్టీ చరిత్రలో ఫస్ట్ టైం

పార్లమెంట్లో బీఆర్ఎస్ జీరో.. పార్టీ చరిత్రలో ఫస్ట్ టైం

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో   కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీగా ఉన్నాయి. 17 పార్లమెంట్ స్థానాల్లో చెరో 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఎంఐఎం ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉంది.  అయితే బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశాలు కనిపించడం లేదు.    కేసీఆర్ కంచుకోట అయిన మెదక్ పార్లమెంట్ లో కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 30 వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 17 స్థానాల్లో పోటీచేసిన బీఆర్ఎస్ కేవలం రెండు చోట్ల మాత్రమే సెకండ్ ప్లేసులో ఉంది.  ఎన్నడూ లేనంతగా పార్టీ చతికిలపడిపోయింది. 

2001లో టీఆర్ఎస్ స్థాపించిన తర్వాత  2004 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో  కేసీఆర్  కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు.  తర్వాత 2009 లోక్ సభ ఎన్నికల్లో  మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్, మెదక్ నుంచి విజయశాంతి టీఆర్ఎస్ నుంచి ఎంపీలుగా ఉన్నారు.  తర్వాత  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 లో 11 లోక్ స్థానాలను గెలుచుకుంది.  2019 లోనూ టీఆర్ఎస్ 9 స్థానాలను గెలుచుకుంది. కానీ 2024 జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేకుండా పోతుంది. దీంతో  బీఆర్ఎస్ పార్టీ.. చరిత్రలోనే  ఫస్ట్ టైం లోక్ సభకు ప్రాతినిధ్యాన్ని కోల్పోతుంది.