తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు ఆపాలని హైకోర్టులో పిల్ : జూలూరు గౌరీశంకర్

  • రచయిత జూలూరు గౌరీశంకర్ దాఖలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తల్లి విగ్రహాల మార్పును సవాలుచేస్తూ హైదరాబాద్‌‌కు చెందిన రచయిత జూలురు గౌరీశంకర్‌‌.. హైకోర్టులో పిల్‌‌ వేశారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలను మారుస్తూ రాష్ట్రవ్యాప్తంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.150 కోట్ల భారం పడుతుందని ఆయన తన పిల్ లో పేర్కొన్నారు.

 ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరారు. కాగా.. ఈ పిల్ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. అంతేగాకుండా తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన కాంట్రాక్ట్‌‌ను సవాలుచేస్తూ దాఖలైన మరో పిల్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది.