న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తా : బీఆర్ఎస్ కోదాడ అభ్యర్థి మల్లయ్య

కోదాడ, వెలుగు:  న్యాయవాదుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని బీఆర్ఎస్ కోదాడ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ హామీ ఇచ్చారు.  బుధవారం బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోదాడ ప్రాంతానికి రావాల్సిన కోర్టుల మంజూరుకు చొరవ తీసుకుంటానని చెప్పారు.  న్యాయవాదుల్లో పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించడంతో పాటు  గృహ లక్ష్మి పథకం  ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం  అందిస్తామని మాటిచ్చారు.

 జూనియర్ న్యాయవాదుల సంక్షేమానికి పాటుపడతానని, ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు,  పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్‌‌చార్జి శశిధర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవబత్తిని నాగార్జున రావు,  ప్రధాన కార్యదర్శి సాధు శరత్ బాబు, ట్రెజరర్‌‌‌‌ జానీ పాషా,  సభ్యులు హేమలత, దొడ్డ శ్రీధర్, వెంకటాచలం, సీనియర్ న్యాయవాదులు సుధాకర్ రెడ్డి, రంజాన్ బాషా,   వెంకటేశ్వర్లు,  యశ్వంత్,   నర్సయ్య,  రవికుమార్ పాల్గొన్నారు. 

ALSO READ : కేసీఆర్​ మిడ్‌‌‌‌మానేరు నిర్వాసితులను మోసం చేసిండు : ఆది శ్రీనివాస్