బీఆర్ఎస్​ కీలక నేత హరీష్​ రావు బంధువులపై కేసు నమోదు

బీఆర్ఎస్​ కీలక నేత హరీష్​ రావు బంధువులపై కేసు నమోదు

బీఆర్ఎస్ కీలక నేత.. మాజీ మంత్రి హరీష్ రావు బంధువులపై మియాపూర్ పొలీస్ స్టేషన్ లో  ట్రెస్ పాస్, ఛీటింగ్ కేసు నమోదైంది.  దండు లచ్చిరాజు అనే వ్యక్తికి సంబంధించిన ఆస్తిని .. ఆయనకు తెలియకుండానే హరీష్ రావు బంధువులు అమ్మేశారని  ఫిర్యాదు చేశారు.  లచ్చిరాజు ఇంటిని  హరీష్  రావు తమ్ముడు తన్నీరు గౌతమ్​, ఇతర బంధువులు బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోనెల రాజ్ కుమార్ గౌడ్, గారపాటి నాగ రవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు ఆక్రమించుకొని అమ్మారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Also Read :- ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెవెన్యూ అంచనా పెంపు

 మాజీ మంత్రి బంధువులు తనను ప్రాంసరీ నోటుతో మోసం చేశారని ఫిర్యాదు దారుడు కంప్లయింట్​ చేశారు.  తనకు తెలియకుండా తన ప్రాపర్టీని విక్రయించి ... ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఫిర్యాదు అందుకున్న మియాపూర్​ పోలీసులు కేసు నమోదు చేశారు.