ఎలక్షన్ అబ్జర్వర్​గా బీఆర్ఎస్ నేత

  •     అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పలు పార్టీల నేతలు 

కాశీబుగ్గ, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్​లో జూనియర్ అసిస్టెంట్​గా పని చేస్తున్న బీఆర్ఎస్ నేత సాయిని ముత్యం రావుకు ఎన్నికల విధులు అప్పగించడంపై పలు పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముత్యం రావును ఎలక్షన్ అబ్జర్వర్​గా నియమించడం ఏంటని బల్దియా ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల కింద బీఆర్ఎస్ కండువా కప్పుకుని.. సీఎం రేవంత్​రెడ్డిని ఇష్టమొచ్చినట్టు తిట్టాడని, దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత అని తెలిసి కూడా ఎన్నికల విధులు అప్పగించడం సరికాదని పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు. వెంటనే ముత్యం రావును ఎన్నికల విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.