బీఆర్ఎస్​ రెబల్​గా నామినేషన్​ వేస్తా : బొమ్మెర రామ్మూర్తి

  • భట్టితో పువ్వాడ అజయ్​చీకటి ఒప్పందం చేస్కుండు
  • బీఆర్ఎస్​లీడర్ బొమ్మెదర రామ్మూర్తి 

మధిర, వెలుగు : సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చీకటి ఒప్పందం చేసుకున్నాడని, అందుకే మధిరలో ఓడిపోయే వ్యక్తికి బీఆర్ఎస్​టికెట్​ఇప్పించారని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్​నాయకుడు బొమ్మెర రామ్మూర్తి ఆరోపించారు. బుధవారం ఆయన మధిరలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. నవంబర్ 3న బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని స్పష్టం చేశారు.

మందకృష్ణ మాదిగతోపాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తనకు వ్యక్తిగతంగా మద్దతు తెలిపారని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ బార్డర్​లోని మధిరలో తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేశానని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ బీఆర్ఎస్ లో పనిచేస్తున్నానని, అయినప్పటికీ తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదని వాపోయారు. తానేం నేరం చేశానో చెప్పాలని ప్రశ్నించారు. ఆయన వెంట నాయకులు బొబ్బిళ్లపాటి బాబురావు, సురేశ్​తదితరులు ఉన్నారు.