వేములవాడ, వెలుగు: రాష్ట్రంలోని అన్ని వర్గాలను బీఆర్ఎస్ సర్కార్ ఆదరిస్తోందని వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావు అన్నారు. ఆదివారం పట్టణంలోని అరె క్షత్రియ కుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచాక అరె కులస్తులను ఓబీసీలుగా గుర్తించడం, పట్టణంలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సిలువేని మల్లేశం, ఉపాధ్యక్షుడు దేవరావు, ఇటిక్యాల నవీన-రాజు పాల్గొన్నారు. నాంపల్లిలో పలువురు బీఆర్ఎస్‌లో చేరారు.