టికెట్​ ఇస్తే కాంగ్రెస్‌లోకి..బీఆర్‌‌ఎస్‌ లీడర్ వెంకటేశ్వర్ రెడ్డి

యాదాద్రి, వెలుగు : భువనగిరి అసెంబ్లీ టికెట్​ ఇస్తానంటే.. కాంగ్రెస్​లో చేరుతానని బీఆర్​ఎస్​ లీడర్​ చింతల వెంకటేశ్వర్​రెడ్డి స్పష్టం చేశారు.  మంగళవారం భువనగిరి మండలం వడపర్తిలో మీడియాతో మాట్లాడుతూ.. తొమ్మిదేండ్లుగా బీఆర్ఎస్​లో కొనసాగు తున్నా.. పార్టీ తనను ఉపయోగించుకోవడం లేదని చెప్పారు.

తన అనుచరులతో మాట్లాడిన తర్వాత వారి సమ్మతితోనే సోనియాగాంధీ సమక్షంలో తిరిగి కాంగ్రెస్​లో చేరుతానని ఆయన తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ వైపునకు ప్రజలు చూస్తున్నారని అన్నారు.

ALSO READ :కుక్క దేవో భ‌వ.. కుక్క‌ల‌కు గుడి, విగ్ర‌హాలు, పూజ‌లు