రెండో రోజు 32 నామినేషన్లు

యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు:  ఉమ్మడి జిల్లాలో తొలిరోజు 16 నామినేషన్లు రాగా.. రెండో రోజైన శనివారం 32 నామినేషన్లు దాఖలు అయ్యాయి.  భువనగిరి అసెంబ్లీకి ట్రిపుల్​ ఆర్​ బాధితుడైన రైతు అవిశెట్టి పాండు,  భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి తరఫున బీఆర్​ఎస్​ లీడర్​ కొలుపుల అమరేందర్, ఎమ్మెల్యే మామ మోహన్​రెడ్డి​ రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. శివసేన నుంచి పూస శ్రీనివాస్​ నామినేషన్​ వేశారు. ఆలేరు స్థానానికి విద్యార్థి రాజకీయ పార్టీ తరపున బుగ్గ శ్రీకాంత్,  కోదాడలో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా తండు ఉపేందర్, గంగిరెడ్డి కోటి రెడ్డి ,  సూర్యాపేటలో పోతుల యాదగిరి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. తుంగతుర్తి నుంచి దేవర జానయ్య రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి నామినేషన్  వేసినట్లు కలెక్టర్‌‌ తెలిపారు.  దేవరకొండ నుంచి బీఆర్‌‌ఎస్ తరఫున రవీంద్ర కుమార్ (రెండు సెట్లు),  కాంగ్రెస్ తరఫున నేనావత్ బాలునాయక్, ఇండిపెండెంట్‌ అభ్యర్థి రమావత్ గోపాల్ కృష్ణ నామినేషన్ దాఖలు చేశారు.

నాగార్జునసాగర్‌‌లో  పోనుగోతు లాల్ సింగ్, తక్కెళ్ళపల్లి కోటేశ్వరరావు, గాదె సైదిరెడ్డి, మిర్యాలగూడ నుంచి మల్లాది వెంకట రామారెడ్డి, ధనవత్ ఉషా నాయక్ , నల్గొండ నుంచి చోలేటి ప్రభాకర్ రెడ్డి (రెండు సెట్లు) , గండికోట వెంకట లక్ష్మణ్ , రేఖల సైదులు (రెండు సెట్లు), చింతకింది స్వామి కుమార్ ఇండిపెండెంట్‌గా,   ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి వడ్డబోయిన సైదులు నామినేషన్ వేశారు.  మునుగోడు నుంచి బేరి వెంకటేశ్‌, గొల్లపల్లి నరేశ్, పూదరి మల్లేశం, మెగావత్ చందు ఇండిపెండెంట్‌గా, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి కర్నాటి వెంకటయ్య గౌడ్,  నకిరేకల్ నుంచి బోడ అశ్విని కుమార్, పి మధు ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు.