హైదరాబాద్, వెలుగు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో చేసిన సోదాల్లో ఏం దొరికాయో బయటపెట్టాలని ఎన్ఫోర్స్మెంట్డైరెక్టరేట్(ఈడీ)ని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు.
పొంగులేటి ఇండ్లు, ఆఫీసుల్లో ఐదు రోజుల పాటు ఈడీ ఆఫీసర్లు సోదాలు చేశారని, ఈ సోదాల్లో కోట్ల కొద్దీ డబ్బులు, బంగారం దొరికినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని అన్నారు. దీనిపై ఈడీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.