మూసీ ప్రక్షాళన పేరుతో పేదలను రోడ్డున పడేశారు : దాసోజు శ్రవణ్​కుమార్​

మూసీ ప్రక్షాళన పేరుతో పేదలను రోడ్డున పడేశారు : దాసోజు శ్రవణ్​కుమార్​
  • రౌండ్​టేబుల్​ సమావేశంలో వక్తలు

ఖైరతాబాద్, వెలుగు: మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాకంఠకంగా మారిందని బీఆర్ఎస్​ నాయకుడు దాసోజు శ్రవణ్​కుమార్​అన్నారు. మూసీ బాధితుల సమస్యల పరిష్కారంపై ఆమ్​ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో సోమాజిగూడ  ప్రెస్​క్లబ్​లో సోమవారం అఖిలపక్ష రౌండ్​టేబుల్​సమావేశం జరిగింది. ఆప్ తెలంగాణ కన్వీనర్​ దిడ్డి సుధాకర్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.

డీపీఆర్​ లేకుండా ఇండ్లను కూలగొట్టడం ఎక్కడా చూడలేదన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్​ చేశారు. సోషల్​ యాక్టివిస్ట్ సజయ మాట్లాడుతూ.. జీవితకాలం సంపాదించిన సొమ్ముతో పేదోళ్లు ఇండ్లు కట్టుకుంటే అకస్మాతుగా వచ్చిన అధికారులు వాటిని ధ్వంసం చేయడం దారుణమన్నారు.  బీఆర్ఎస్ ​నేత లక్ష్మారెడ్డి, జనసేన నేత కావేరి, టీడీపీ నేత సయ్యద్ వాజీద్​అహ్మద్​ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.