ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అధికార బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత డాక్టర్ మట్టా దయానంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 2023 మే 26 శుక్రవారం రోజున గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా ఆయన అనుచరులు ప్రకటనను రిలీజ్ చేశారు.
2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటి చేసిన దయానంద్ స్వల్ప ఓట్ల తేడాతోఓటమి పాలయ్యారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. అయితే 2018లో బీఅర్ఎస్ నుండి టికెట్ ఆశించి దయానంద్ భంగపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కూడా సిట్టింగ్ లకే టికెట్ల ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో దయానంద్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
సత్తుపల్లిలో బలమైన నాయకుడిగా మట్టా దయానంద్ కు మంచి గుర్తింపు ఉంది. సమాజ సేవ చేయడంలో కూడా మట్టా ఎప్పుడు ముందుంటారు.