సీఎంను కలిసిన బీఆర్ఎస్​ నేత గట్టు తిమ్మప్ప

సీఎంను కలిసిన బీఆర్ఎస్​ నేత గట్టు తిమ్మప్ప

గద్వాల, వెలుగు : బోయ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు తమ్ముడు, స్టేట్ కో ఆపరేటివ్  కన్జ్యూమర్  ఫెడరేషన్  మాజీ చైర్మన్  గట్టు తిమ్మప్ప శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్  పార్టీలో చేరతారనే చర్చ కొనసాగుతోంది. ఎమ్మెల్యే ఎన్నికలకు ముందే మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడి భార్య భువనేశ్వరి, ఆయన అన్న కొడుకు హనుమంతు, గట్టు జడ్పీటీసీ శ్యామల కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి రాకముందే రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్  పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది.

కొన్ని రోజుల అనంతరం గట్టు భీముడు భార్య భువనేశ్వరి, ఆమె కుమారులు కాంగ్రెస్  తీర్థం పుచ్చుకున్నారు. జడ్పీటీసీ శ్యామల, హనుమంతుతో పాటు గట్టు తిమ్మప్ప బీఆర్ఎస్  పార్టీలోనే కొనసాగుతూ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. ఎన్నికల తర్వాత అనూహ్యంగా గట్టు తిమ్మప్ప సీఎం రేవంత్ రెడ్డి ని కలకలం రేపుతోంది.

గద్వాల నియోజకవర్గంలో బీసీ బోయ సామాజికవర్గానికి చెందిన వారిని పార్టీలో చేర్చుకొని వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో మెజార్టీ సాధించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్  పార్టీ హైకమాండ్  పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే గట్టు తిమ్మప్ప కాంగ్రెస్​ పార్టీలో చేరతారనే సంకేతాలు ఇచ్చారు.