
ఖమ్మం పత్తిమార్కెట్ను మాజీ మంత్రి.. బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు సందర్శించారు. అయితే ఆ సమయంలో అక్కడ పత్తి రైతులు లేకపోవడంతో హరీష్ రావు నిరుత్సాహానికి లోనయి అసంతృప్తి చెందారు. హరీష్‌రావు పర్యటనకు రైతులు హాజరుకాలేదు. .. రైతులను తరలించడంలో లోకల్ బీఆర్ఎస్ లీడర్లు విఫలమయ్యారు. మార్కెట్ లో హమాలీలతో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. కొంతమందికి మైక్ ఇచ్చి మాట్లాడమని చెప్పగా.. వారు ముఖం చాటేశారు . పత్తి ధరల గురించి .. రైతు బంధు గురించి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఖమ్మం పత్తి మార్కెట్లో రైతుల నుంచి స్పందన లేకపోవడంతో హరీశ్‌రావు కొద్దిసేపటికే తిరుగు ప్రయాణమయ్యారు.