ఐటీఐలు, గురుకులాలు అధ్వానం: హరీశ్‌‌‌‌ రావు

ఐటీఐలు, గురుకులాలు అధ్వానం: హరీశ్‌‌‌‌ రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఐటీఐ కాలే జీలు, గురుకులాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మాజీ మంత్రి హరీశ్‌‌‌‌ రావు విమర్శించారు. పెద్దపల్లి, సంగారెడ్డి, ఆదిలాబాద్ సహా రాష్ట్రంలోని ఐటీఐలు అన్నీ అధ్వానంగా ఉన్నాయని ఆరోపించారు. పారిశుద్ధ్య నిర్వహణ, టాయిలెట్స్, అవసరమైన సిబ్బంది లేక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని ట్వీట్ చేశారు.

 ‘‘లైబ్రరీలో కం ప్యూటర్లు, ఇతర మెషీన్లు పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయలేకపోతున్నారు. కొన్ని చోట్ల ఐటీఐ తరగతుల్లోకి వాన నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు”అని సర్కార్‌‌‌‌‌‌‌‌పై హరీశ్‌‌‌‌ ఫైర్​ అయారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఐటీఐలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.