ఒక్క రూపాయి ఇవ్వండి.. నన్ను గెలిపించండి : జలగం సుధీర్

  • ఒక్క రూపాయి ఇవ్వండి.. నన్ను గెలిపించండి
  • అవినీతిలేని పాలన అందిస్త: జలగం సుధీర్

సూర్యాపేట, వెలుగు : బీఆర్ఎస్ లీడర్, ఎన్ఆర్ఐ జలగం సుధీర్ సూర్యాపేట జిల్లా కోదాడ సెగ్మెంట్​లో డిఫరెంట్ స్టయిల్​లో ప్రచారం చేస్తున్నారు. అవినీతి లేని రాజకీయాలు చూడాలంటే తనను గెలిపించాలని, తనకు మద్దతుగా ప్రతీ ఓటర్ ఒక్క రూపాయి విరాళంగా ఇవ్వాలని అడుగుతున్నారు. ఓటు కూడా తనకే వేసి గెలిపించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

నియోజకవర్గంలోని పలు సమస్యలపై స్వచ్ఛందంగా పోరాడిన సుధీర్ .. 2001 నుంచి బీఆర్​ఎస్​ పార్టీలో ఉన్నారు. గత ఎలక్షన్లప్పుడు తనకు ఎమ్మెల్యే టికెట్​ ఇవ్వాలని కోరినప్పటికీ పార్టీ తిరస్కరించింది. ఈ సారి కూడా బీఆర్ఎస్ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో రెబల్​గా పోటీ చేస్తానని ప్రకటించారు. నామినేషన్ వేసేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు.