
ఆదిలాబాద్టౌన్, వెలుగు: పాయల్ శంకర్ ఎమ్మెల్యేగా గెలిచాననే అహం తప్పా.. అభివృద్ధిపై విజన్ లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఆయన విధానాల వల్లే బీజేపీ నాయకులు పార్టీని వీడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. తాను మంత్రిగా రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధితో పనిచేశానే తప్పా.. నీచ రాజకీయాలకు ఎప్పుడు పాల్పడలేదని అన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి పాయల్ శంకర్, జడ్పీ మాజీ చైర్మన్ సుహాసిని రెడ్డి రైతులను రెచ్చగొడుతూ నీచ రాజకీయాలు చేశారని విమర్శించారు. బీజేపీ టౌన్ సెక్రటరీ భగత్ నరేశ్, సోషల్ మీడియా కన్వీనర్ రాచర్ల శరత్ తో పాటు పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇకనైనా బీజేపీ నాయకులు నీచ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఇజ్జగిరి నారాయణ, అజయ్, సలీం, శ్రీనివాస్, కుమ్ర రాజు, కొండ గణేశ్, కోవా రవి, నల్ల మహేందర్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.