ఈ మూడు కారణాలతోనే కవితకు బెయిల్

ఈ మూడు కారణాలతోనే కవితకు బెయిల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని అంశాలను ప్రస్తావించింది. 

>>> ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో సీబీఐ ఇప్పటికే తమ తుది ఛార్జిషీట్ దాఖలు చేసింది. 
>>> ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో ఈడీ తన విచారణను పూర్తి చేసింది. 
>>>  బెయిల్ అనేది మహిళకు సాధారణ ప్రక్రియగా అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. ఆమె మాజీ ఎంపీ.. ఆమె న్యాయం నుంచి పారిపోయే అవకాశం లేదు. మహిళలకు బెయిల్ రావడమే సాధారణ పద్దతిగా భావించి బెయిల్ మంజూ చేసింది సుప్రీంకోర్టు. 

ఈ కేసులో ఈడీ, సీబీఐ విచారణ చేసింది. ఈ రెండు విచారణ సంస్థలు నమోదు చేసిన కేసుల్లో కవిత అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయటం.. ఈడీ విచారణ కంప్లీట్ కావటంతో బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు.